![]() |
![]() |

తన అందం అభినయంతో ఆకట్టుకుంటోన్న విష్ణు ప్రియ మొదటగా చిన్న చిన్న షోలకు యాంకరింగ్ చేస్తూ.. ఇప్పుడు తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ని తెచ్చుకుంది. ఈ భామకి ఆఫర్స్ బీభత్సంగా రావడంతో ఒక్కసారిగా హీరోయిన్ రేంజ్ కి వెళ్లిపోయింది. ఒకవైపు టీవీ షోస్, మరోవైపు ఈవెంట్స్ తో ఖాళీ లేకుండా బిజీ జీవితం గడుపుతోంది. రీసెంట్ గా బిగ్ బాస్ ఫేమ్ మానస్ తో ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ లో తన అందమైన అందాలతో మెరిసింది. అది సూపర్ హిట్ కావడంతో ఆఫర్స్ తనని వెతుక్కుంటూ వస్తున్నాయి.
ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటూ.. తన ఫోటోస్ ని షేర్ చేస్తుంది. గత వారమే ఒకేషన్ అంటూ మాల్దీవులలో దిగిన ఫొటోస్ ని షేర్ చేస్తూ తన ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది.
విష్ణు ప్రియ కరీంనగర్ లో సందడి చేసింది. ఆమె అక్కడ ఒక ఇంటర్నేషనల్ బ్రైడల్ మేకప్ సెలూన్ ఓపెనింగ్ కి వచ్చి మీడియాతో మాట్లాడింది. "నాకు ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం గర్వంగా ఉంది" అంటూ మాట్లాడింది. అయితే విష్ణు ప్రియని చూడడానికి జనాలు బారులు తీరారు.
![]() |
![]() |